Bakka: రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడిగా బండి సంజయ్: బక్క జడ్సన్
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi Sanjay) ఉన్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్(Bakka Judson) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi Sanjay) ఉన్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్(Bakka Judson) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుల(BJP Leaders)పై ఫైర్ అయ్యారు. లగచర్లలో గిరిజనుల మీద దాడి జరుగుతుంటే బీజేపీ వాళ్లు మూసీ నిద్ర(Moosi Nidra) చేస్తున్నారని, లగచర్ల ఘటన(Lagacharla Incident)ను డైవర్డ్(Divert) చేసేందుకే ఈ కార్యక్రమం ముందుకు తెచ్చారని మండిపడ్డారు.
మూసీలో ఇల్లు కూలకొడుతున్న సమయంలో గాడిద పళ్లు తోముతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆయనను గెలిపించడానికి బీజేపీ నాయకులే ముందుకు వస్తారని వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తే తాను కూడా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి చంద్రబాబు(Cm Chandrababu), మోడీ(PM Modi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చీఫ్ పోలింగ్ ఏజెంట్గా బండి సంజయ్, క్యాంపెయినింగ్ చూసుకోడానికి కిషన్ రెడ్డి(G.Kishan Reddy), పోలింగ్ ఏజెంట్గా విశ్వేశ్వర్ రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డి గెలవడని విమర్శలు చేశారు. అంతేగాక ఇక్కడ మా ప్రభుత్వం ఉందని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనుకుంటారని, కానీ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదని బీజేపీ నాయకులదే నడుస్తోందని బక్క జడ్సన్ అన్నారు.