మేము ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమెనే.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్- అందాల ముద్దుగుమ్మ అదితిరావు హైదరీ రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-25 04:14 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్- అందాల ముద్దుగుమ్మ అదితిరావు హైదరీ రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లు పాటు సీక్రేట్‌గా డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. అలాగే వివాహం కూడా కేవలం కొంత మంది సమక్షంలో అక్కడే చేసుకున్నారు ఈ జంట. ఇక వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పిక్స్ కాస్త వైరల్‌గా మారాయి. అయితే తాజాగా సాహిత్య ఆజ్ తక్- 2024 సదస్సుకు అదితి రావు కూడా హాజరయ్యారు. అక్కడ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆమె మాట్లాడుతూ.. ‘ మా పెళ్లి పెద్దగా ప్లాన్ చేయలేదు. వివాహం జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టారు. దాదాపు 400 ఏళ్లుగా మా కుటుంబంలో భాగంగా ఉంది. అంతేకాదు ఆ ఆలయం నా ఫ్యామిలీలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాగే నానా, నానమ్మకు చాలా ఇష్టమైన గుడి. అందుకే వివాహం అక్కడ చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వారి ఆశీస్సులు కూడా మాకు అందాయి’ అని అదితి రావు హైదరీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Tags:    

Similar News