Parliament Winter Sessions 2024: ప్రారంభమైన శీతాకాల పార్లమెంట్ సమావేశాలు.. వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Parliament Sessions) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో.. ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో కేసు, మణిపూర్(Manipur)లో మళ్లీ జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.

Update: 2024-11-25 06:05 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Parliament Sessions) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో.. ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో కేసు, మణిపూర్(Manipur)లో మళ్లీ జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన లోక్ సభ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

పార్లమెంట్ సమావేశాలకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండియా బ్లాక్ ఎంపీలు సమావేశమయ్యారు. లోక్ సభ సమావేశాల్లో ఏకగ్రీవంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే చర్చకు వచ్చే అంశాలపై ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్ ఎంపీలు చర్చించుకున్నారు. 

Tags:    

Similar News