తెలుగోడి సృష్టికి ఆనంద్ మహీంద్ర ఫిదా.. తనకు కూడా కావాలంటూ ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ యుగమైంది. ప్రజలు నడకను సైతం కృత్రిమంగానే కానిచ్చేస్తున్నారు.

Update: 2022-03-24 09:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ యుగమైంది. ప్రజలు నడకను సైతం కృత్రిమంగానే కానిచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ట్రెడ్ మిల్‌ను వినియోగించి వ్యాయామం చేస్తుంటారు. అయితే, తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన వడ్రంగి కడిపి శ్రీనివాస్.. వినూత్న యంత్రాన్ని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. చెక్క ముక్కలను వినియోగించి విద్యుత్ అవసరం లేని ట్రెడ్ మిల్‌ను తయారు చేశారు. దీనిని వీడియో తీసి నెట్టింట పెట్టడంతో తెగ వైరల్ అయ్యింది. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించి ఇలాంటి ట్రెడ్ మిల్‌ల తయారీలను పెంచి ఉపాధి కల్పించేందుకు 'టీవర్క్స్‌ హైదరాబాద్‌'తో కలిసి పనిచేయాలని ఆఫర్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ యంత్రంపై ఆసక్తి చూపారు. ''విద్యుత్ ఆధారిత యంత్రాల ప్రపంచంలో హస్తకళపై ఉన్న ఇష్టంతో గంటల తరబడి కృషి చేసి ఈ ట్రెడ్ మిల్‌ను రూపొందించారు. ఇలాంటిది తనకు ఒకటి కావాలి'' అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News