President Draupadi Murmu' : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి లగచర్ల ఘటన అంశం

లగచర్ల(Lagacharla)బాధితుల గోడును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu's) దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్(Brs) సిద్దమైంది.

Update: 2024-11-19 06:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla)బాధితుల గోడును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu's) దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్(Brs) సిద్దమైంది. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. లగచర్లలో గిరిజనులపై పోలీసుల చర్యలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరడం ఆసక్తికరంగా మారింది. లగచర్లలో ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం బలవంతపు భూ సేకరణ..ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కలెక్టర్ పై డాడి, పోలీసుల చర్యలపైన, గిరిజన మహిళలపై వారి దౌర్జన్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు.

రాష్ట్రపతిని కలసి మా గోడు వినిపించే వరకు ఢిల్లీలోనే ఉంటామని గిరిజన మహిళలు స్పష్టం చేశారు. ఇప్పటికే లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సీ, ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..