కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పీఏ పై కేసు..
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే పీఏ పై కేసునమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు.
దిశ, పేట్ బషీరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే పీఏ పై కేసునమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్న బండ మల్లేష్ ఈ నెల 15న ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో “ప్రజా ప్రభుత్వమా ? ఎనుముల ప్రభుత్వమ ?.. సూపర్ క్యాబినెట్ల గుంపు మేస్త్రి కుటుంబం.. పేరుకే మంత్రివర్గం.. నిర్ణయాలని ఎనుముల కుటుంబానివే” అంటూ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పేర్కొంటూ వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారు.
అంతే కాకుండా ఓ చర్చ వేదికలో ఇంగ్లీషులో మాట్లాడుతూ తడబడుతున్న వీడియో పై మీన్ వీడియో క్రియేట్ చేసి “అరెరే ఎంత కష్టం వచ్చి రా మూసి రెడ్డికి..” అంటూ పోస్ట్ చేశాడు. ఈ అంశం పై గాజులరామారం చెందిన వ్యక్తి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బండ మల్లేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే కేపీ వివేకానందకు ప్రైవేటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు.