పిట్టల బస్తీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం : కూకట్​పల్లి ఎమ్మెల్యే

పిట్టల బస్తీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే

Update: 2024-11-18 14:05 GMT

దిశ, కూకట్​పల్లి: పిట్టల బస్తీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఫతేనగర్​ డివిజన్​ పరిధిలోని పిట్టల బస్తీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం స్థానిక కార్పొరేటర్​ పండాల సతీష్​ గౌడ్​తో కలిసి పర్యటించారు. కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్​ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం పిట్టల బస్తీలో పాదయాత్ర నిర్వహించి కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డివిజన్​లో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. కాలనీలో ప్రభుత్వ పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకుంటున్నట్టు తమ దృష్టికి రావడంతో వెంటనే కమ్యూనిటి హాల్​ నిర్మాణం చేపట్టి అందులో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కాలనీలో తాగునీటి, డ్రైనేజి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శంకర్​, డివిజన్ అధ్యక్షుడు భిక్షపతి, రాములు, జయమ్మ, రాము, కీర్తి తదితరులు పాల్గొన్నారు.


Similar News