గిరిజన సాహిత్యంలో సమాజపు జీవిత మూలాలున్నాయి : KU ప్రోఫెసర్

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరిగి గిరిజన ప్రజల జీవితలతో మమేకపై వారి ఆచారాలు, సం

Update: 2022-03-13 07:15 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరిగి గిరిజన ప్రజల జీవితలతో మమేకపై వారి ఆచారాలు, సంప్రదాయాలు అక్షరబద్ధం చేసి విలువైన సమాచారంతో గిరిజన సాహిత్య పరిశోధన చేయడం అభినందనీయమని కేయూ వైస్ ఛాన్స్‌ల‌ర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అన్నారు. కేయూ దూరవిద్య కేంద్రం తెలుగు కో - ఆర్డినేటర్ డాక్టర్ కొట్టే భాస్కర్ రూపొందించిన తెలంగాణ ప్రాంత గిరిజనుల పంచాయితీ విధానం ఒక పరిశీలన ' అనే సిద్ధాంత గ్రంథాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కేయూ పరి పాలన భవనంలోని కమిటీ హాల్లో హైదాంబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేశ్ అధ్యక్షత జరిగిన సమావేశంలో కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరైయారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టైరు వెంకట్రామిరెడ్డి, కేయూ డీవో ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం , దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ టి . శ్రీనివాసరావు , అడిషనల్ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ , హిస్టరీ ప్రొఫెసర్ కనుకరత్నం , ప్రొఫెసర్ గడ్డం వెంకన్నలతో కలిసి పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మాట్లాడుతూ.. గిరిజన సాహిత్యంలో సమాజపు జీవిత మూలాలున్నాయని పేర్కొన్నారు. నైతిక జీవన న్యాయపు సూత్రాల ఆధారంగా గిరిజన జీవితం ఆధారపడుతోం దని పేర్కొన్నారు. గిరిజన కులనేతలు ఎలాంటి బేషజాలు లేకుండా న్యాయం చెబుతారని, అందరికీ న్యాయం చేయడం గిరిజన సంప్రదాయాల ప్రధాన లక్షణమన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మంచి అంశాన్ని పరిశోధన చేసి సమాజానికి గొప్ప పరిశోధన గ్రంథాన్ని అందించారని డాక్టర్ కొట్టే భాస్కర్ కృషిని అభినందించారు. పుస్తక రూపకర్త డాక్టర్ కొట్టే భాస్కర్ మాట్లాడుతూ .. గిరిజన సాహిత్యాపు ఔన్నత్యాన్ని సమాజం గుర్తించేలా విలువైన అంశాలను తన పరిశోధన గ్రంథంలో వెలువరించినట్లు తెలిపారు . కార్య‌క్ర‌మంలో . కేయూ డెవలప్మెంట్ అధికారి ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేశ్, వరంగల్ తెలుగు యూనివర్సిటీ పీఠం డీన్ ప్రొఫెసర్ గడ్డం వెంకన్న, దూరవిద్య కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ సోమరాతి భిక్షపతి, వైస్ చాన్స్లర్ సలహాదారులు ప్రొఫెసర్ పి . గోపికృష్ణ , ప్రొఫెసర్ కృష్ణమాచార్యులు , డాక్టర్ ఆకులపల్లి మధు , డాక్టర్ ఈదుల చంద్రమౌళి , డాక్టర్ మాచర్ల ఐలేశ్వర్ , తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News