యూపీ స్పీకర్ సతీష్ మహానా.. ఏకగ్రీవానికి ప్రభుత్వం, విపక్షాలు ఓకే
లక్నో: యూపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ..telugu latest news
లక్నో: యూపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత సతీష్ మహానాను ఎన్నుకున్నారు. మంగళవారం 18వ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయనను ఎన్నుకున్నారు. తాత్కాలిక స్పీకర్ రమాపతి శాస్త్రి మహానా ఎన్నికకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అనంతరం సీఎం యోగీ ఆదిత్యనాథ్, విపక్ష నేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యేలు స్పీకర్ కు అభినందనలు తెలిపారు. అంతకుముందు ఆదిత్యనాథ్, సీనియర్ మంత్రులు మహానాను స్పీకర్‌గా ప్రతిపాదించారు. యోగి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలతో యూపీ అసెంబ్లీ కొత్త స్పీకర్‌కు ఎస్పీ చీఫ్ స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ... 'ప్రస్తుతం ఎన్నుకున్న ప్రభుత్వం డిక్టేటర్‌గా పాలించదని నమ్ముతున్నాం. మీరు విపక్షాల మాటలు కూడా వింటారని ఆశిస్తున్నాం' అని అన్నారు. యోగీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాను విదేశాలకు వెళ్లింది నిజమేనని చెప్పారు. అలా చేయకపోతే లక్నో ఎక్స్‌ప్రెస్ వే, కాన్పూర్ మెట్రో వచ్చేవి కాదని చెప్పారు. అంతకుముందు సీఎం యోగీ ప్రభుత్వం, విపక్షాలు కలిసి ఒకే దిశలో వెళ్తాయని అన్నారు.