సెక్స్ తర్వాత అస్సలు చేయకూడని పనులేంటో తెలుసా?

దిశ, ఫీచర్స్ : భాగస్వామితో లైంగిక జీవితం సాఫీగా సాగాలంటే వారు బెడ్‌పై ఏం ఇష్టపడుతున్నారో గుర్తించడం ముఖ్యం. అలాగే ఈ ఆనందాన్ని దీర్ఘకాలం ఆస్వాదించాలంటే సంభోగం తర్వాత పలు విషయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముంది..Latest Telugu News

Update: 2022-06-21 05:38 GMT

దిశ, ఫీచర్స్ : భాగస్వామితో లైంగిక జీవితం సాఫీగా సాగాలంటే వారు బెడ్‌పై ఏం ఇష్టపడుతున్నారో గుర్తించడం ముఖ్యం. అలాగే ఈ ఆనందాన్ని దీర్ఘకాలం ఆస్వాదించాలంటే సంభోగం తర్వాత పలు విషయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముంది. అయితే ఎంత అలసిపోయినప్పటికీ ముఖ్యంగా స్త్రీలు సెక్స్ తర్వాత అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇవి వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలోనే సెక్సువల్ పార్ట్‌నర్‌తో వీలైనంత ఉత్తమ కమ్యూనికేషన్, సాన్నిహిత్యాన్ని పెంచుకునేందుకు హెల్తీ హ్యాబిట్స్ అలవరచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు స్త్రీలు తమకు ఇబ్బంది కలిగించే విషయాలను పార్ట్‌నర్‌తో చర్చించడమే కాక జననేంద్రియ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ శృంగారం తర్వాత ఫిమేల్స్ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం..

1. మూత్రాశయాన్ని ఖాళీ చేయకపోవడం..

సంభోగం తర్వాత మూత్రాశయాన్ని ఖాళీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అనవసరమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్(UTI)ను నివారిస్తుంది. ఏదైనా బ్యాక్టీరియా అనుకోకుండా ట్రాక్ట్‌లోకి ప్రవేశించినట్లయితే దాన్ని బయటకు పంపేందుకు యూరినేషన్ సాయపడుతుంది. అయితే, సెక్స్ తర్వాత వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక గంట వ్యవధిలో ఎప్పుడైనా మూత్రాశయాన్ని ఖాళీ చేయొచ్చు.

2. నొప్పిని విస్మరించడం :

రతి క్రీడలో, తర్వాత సంభవించే మూలుగు శబ్ధాలు ఎప్పుడూ ఆనందం గురించే కాదు. సాధారణంగా ఇది ఉదర శ్వాస ద్వారా తగ్గించబడుతుంది. అంతేకాదు సెక్స్ సమయంలో లేదా ఆ తర్వాత కలిగే నొప్పి.. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, వెజీనిస్మస్, భావప్రాప్తి, ఎండోమెట్రియోసిస్, డీప్ పెనెట్రేషన్, ఫైబ్రాయిడ్స్ లేదా భావోద్వేగ గాయం కారణంగానూ సంభవించవచ్చు. నొప్పి అలాగే కొనసాగితే, భరించలేనంతగా పెరిగితే వైద్య సలహా కోరడం ఉత్తమం.

3. బిగుతైన లోదుస్తులు ధరించడం :

సెక్స్ తర్వాత యోని ఆరోగ్యం కోసం అనేక అంశాలు పరిగణించాల్సి ఉంది. ఎందుకంటే ఇంకర్‌కోర్స్ ముగిశాక కొందరు కమాండోల మాదిరి సింథటిక్ మెటీరియల్స్ లేదా బిగుతైన లోదుస్తులను ధరించడం వల్ల తొడల మధ్యన కలిగే చెమట చర్మాన్ని చికాకు పెట్టవచ్చు. అందుకే శృంగార చర్యల తర్వాత లోదుస్తులను తొలగిస్తే వేడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈస్ట్ ఇన్‌ఫెక్షన్స్, దురద వంటి అన్ని రకాల ఇన్ఫెక్షన్లు నివారించడంలో సాయపడుతుంది.

4. వెజీనా శుభ్రపరచకపోవడం :

సాధారణంగా యోని భాగానికి సొంతంగా శుభ్రపరుచుకోగల లక్షణం ఉంటుంది. కాబట్టి అక్కడ రసాయన ఆధారిత సబ్బులతో రుద్దడం లేదా శుభ్రపరచడం చేయొద్దు. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. కేవలం యోని pH బ్యాలెన్స్‌ మెయింటైన్ చేసేందుకు గాను సెక్స్ తర్వాత ముందు నుంచి వెనకకు కాస్త తుడిస్తే చాలు. ఇది ఇన్ఫెక్షన్ సంభావ్యతను తగ్గిస్తుంది.

5. బబుల్ బాత్ ఆనందించడం :

పార్ట్‌నర్స్ ఇద్దరూ వేడి నీటి స్నానంలో కౌగిలించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. వేడి నీరు బ్యాక్టీరియా వృద్ధికి సారవంతమైన వేదికగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వెనిగర్‌ ఉపయోగించడం మంచిది. ఇది చర్మం యొక్క సహజ ఆమ్లతను కాపాడి, శుభ్రపరచడంలో తోడ్పడుతుంది.

6. గర్భనిరోధకాలు స్కిప్ చేయడం :

భాగస్వాములు ఒకవేళ శృంగారంలో కండోమ్స్ ఉపయోగిస్తుంటే అవి చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలి. ఇది అవాంఛిత గర్భం, సంక్రమణను నివారిస్తుంది. అలాగే, కాంట్రాసెప్టివ్స్‌ను ఓరల్‌గా తీసుకుంటున్నట్లయితే మాత్ర వేసుకోవడం మర్చిపోవద్దు.

7. సెక్స్ తర్వాత బ్లీడింగ్‌ను పట్టించుకోకపోవడం :

భాగస్వామితో సెక్స్ పూర్తయిన తర్వాత యోని పొడిబారడం, ఫైబ్రాయిడ్స్ కారణంగా ఆ భాగం నుంచి రక్తస్రావం సంభవించవచ్చు. కాబట్టి ఏదేని భాగం నుంచి నొప్పితో కూడిన రక్తస్రావం జరిగితే వెంటనే తగిన జాగ్రత్త తీసుకోవాలి.

* లైంగిక సంపర్కం విషయంలోనే కాదు, ఒకవేళ మీరు సెల్ఫ్ ప్లెజర్ కోసం సెక్స్ టాయ్స్‌పై ఆధారపడుతున్నట్లయితే.. వాటిని ఉపయోగించే ముందు, తర్వాత తప్పకుండా శుభ్రం చేయాలి లేదా కడగాలి. ఇది బాక్టీరియల్ వెజినోసిస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్‌తో పాటు UTI వంటి వెజీనల్ ఇన్ఫెక్షన్స్‌ను దూరంగా ఉంచుతుంది.


Similar News