సీఆర్పీఎఫ్ బంకర్‌పై పెట్రోల్ బాంబ్ విసిరిన మహీళా ఉగ్రవాది
దిశ, వెబ్ డెస్క్: కాశ్మీర్ లో మరోసారి ఉగ్ర దాడి జరిగింది. మరోసారి ఉగ్రవాద కార్యకలాపాల్లో మహీలా latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: కాశ్మీర్ లో మరోసారి ఉగ్ర దాడి జరిగింది. మరోసారి ఉగ్రవాద కార్యకలాపాల్లో మహీలా ఉగ్రవాదులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో బురఖా ధరించిన మహిళ పెట్రోల్ బాంబు తో సీఆర్పీఎఫ్ బంకర్ పై దాడి చేసింది. ఈ తతంగం అంతా.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్‌లో ఓ మహిళా రోడ్డపై నడుచుకుంటూ వేళ్తూ.. తన చేతిలో ఉన్న సంచిలో దాచి ఉంచిన పెట్రోల్ బాంబ్‌కు నిప్పు అంటించి సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్న క్యాంపు మీదకు విసిరి అక్కడి నుంచి పారిపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న జవానులు గమనించి మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Burqa clad person hurled a petrol bomb at CRPF camp in Sopore, J&K. pic.twitter.com/KfwkMMXu9e
— Anshul Saxena (@AskAnshul) March 30, 2022