ఆ సమయంలో ఏసీ, ఫ్యాన్లు ఆపేస్తున్నారంటూ ఓ నెటిజన్ ఫైర్.. ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో యువతపై సినిమా ప్రభావం తారా..latest telugu news
దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో యువతపై సినిమా ప్రభావం తారా స్థాయికి చేరుకుంటుంది. దీనిని ఆయుధంగా తీసుకుని థియేటర్ యజమానులు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఎంత ధర పెట్టినా కొంటరనే ధీమాతో ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. స్టార్ హీరో సినిమాలు వస్తే చాలు థియేటర్ యాజమాన్యానికి పండగే అని చెప్పాలి.
అయితే ఇదంతా ఒక ఎత్తైతే సినిమా చూస్తున్న సమయంలో ఏసీ, ఫ్యాన్లు ఆపేస్తున్నారంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్ద సినిమాల నెపంతో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతున్నారని, పార్కింగ్ ఛార్జీలు కూడా ఇష్టానుసారం పెంచేసి ప్రేక్షకులను దోచుకుంటున్నారని వాపోయాడు. అయితే వీటి సంగతి సరే.. మరి, ఇంటర్వెల్ తర్వాత చివరి గంట, అరగంట సమయం ఉండగానే ఏసీలు, ఫ్యాన్లు ఎందుకు ఆఫ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టికెట్‌కి పెట్టిన డబ్బులు కేవలం సినిమా చూడటానికేనా ? అసలే ఎండాకాలం అంటూ తనకు జరిగిన ఓ సంఘటన పట్ల ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
పెద్ద సినిమాల నెపంతో, సినిమా టిక్కెట్ల అధిక ధరలతో, పార్కింగ్ రుసుములతో సినిమా ప్రేక్షకులను దోచుకుంటారు సరే.
— KISHORE SHENKESHI (@KishoreShenkesi) March 28, 2022
మరీ, ఇంటర్వల్ తర్వాత చివరి గంట, అరగంట సమయం ఉండగానే ఏసీలు, ఫ్యాన్లు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు ? టిక్కెట్ కి పెట్టిన డబ్బులు కేవలం సినిమా చూడడానికేనా ? అస్సలే ఎండాకాలం.