అతడు లేకుండా ఉండలేను.. కోర్టుకెక్కిన 63ఏళ్ల వృద్ధురాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ ఇద్దరి- LATEST TELUGU NEWS
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ ఇద్దరి మధ్య పుడుతుందో తెలియదు. అది ఎవరి మధ్య అయిన పుట్టవచ్చు.. మగ, ఆడ మధ్య కలగవచ్చు.. ఇద్దరు మగవారి మధ్యనైనా.. ఇద్దరి ఆడవారి మధ్యనైనా చిగురించవచ్చు.. ప్రేమ అంటే ప్రేమే. ఇటివల కాలంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కవైపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమలు, పెళ్లిలు కూడా జరిగిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన కంటే 10సంవత్సరాలు చిన్నవాడిని పెళ్లాడింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి కామన్ అయిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 63సంవత్సరాల ఓ వృద్దురాలు 28 సంవత్సరాల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరిది ఒకే గ్రామం కావడంతో వీరి పరిచయం కాస్త గాఢ ప్రేమగా మారింది. దీనితో వీరు కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తూ.. శారీరకంగాను ఒక్కటైనట్లు తెలిపారు. ఒకరిని విడిచి మరొకరం ఉండలేం అని అంటున్నారు ఈ జంట. కానీ ఈ ప్రేమ పక్షులు వివాహనికి మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కలిసే ఉంటున్న వీరు.. భవిష్యత్‌లో వీరి సహజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. వారి సహజీవన బంధాన్ని అధికారికంగా దృవీకరించుకునేందుకు ఏకంగా జిల్లా కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ప్రేమ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.