Kriti Sanon: నెపోటిజమ్‌పై కృతి సనన్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ఐఎఫ్ఎఫ్ఐ(IFFI) 2024 ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది.

Update: 2024-11-26 09:54 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ఐఎఫ్ఎఫ్ఐ(IFFI) 2024 ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె నెపోటిజమ్‌(Nepotism)పై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నాకు సూపర్ ఉమెన్‌ పాత్ర చేయాలని ఉంది. పూర్తిగా నెగెటివ్‌ పాత్రలో నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాను. నెపోటిజమ్‌కు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యత వహించదని నేను భావిస్తున్నా. కానీ ఈ విషయంలో మీడియా, ప్రేక్షకులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. కొందరు స్టార్‌ కిడ్స్‌(Star Kids) పట్ల మాత్రం మీడియా ఎలా వ్యవహరిస్తుందో ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ఆ స్టార్‌ కిడ్స్‌ పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపించడం వల్ల వారితో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని వారు భావిస్తారు.

ఇది ఒక సర్కిల్‌ అని నేననుకుంటున్నాను. మీరు ప్రతిభావంతులైతే ఇండస్ట్రీకి చేరుకుంటారు. ప్రతిభావంతులు కాకపోతే, ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వ లేకపోతే, అక్కడికి చేరుకోలేరు. నేను వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ(Industry) నాకు సాదర స్వాగతం పలికింది. మీరు సినిమా బ్యాక్ గ్రౌండ్‌ నుంచి రానప్పుడు.. కోరుకున్నది అందుకునేందుకు, మ్యాగజైన్‌ కవర్‌(Magazine cover)లో చోటు సంపాదించుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇండస్ట్రీలో ప్రతిదీ కొంచెం కష్టంతో కూడుకునే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News