సెక్స్ కోసం గ్లాసును వాడిన మహిళ.. నాలుగేళ్లుగా అదే ప్లేస్‌లో..

దిశ, ఫీచర్స్ : ఏడాది నుంచి యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న తునీషియా మహిళ latest telugu news..

Update: 2022-03-21 11:23 GMT

దిశ, ఫీచర్స్ : ఏడాది నుంచి యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న తునీషియా మహిళ.. డాక్టర్‌ను సంప్రదించడంతో షాకింగ్ విషయాలు బయపటపడ్డాయి. ఆమె మూత్రాశయంలో ఒక గాజు గ్లాస్ ఇరుక్కుపోయిందని వైద్యులు కనుగొన్నారు. యూరిన్ లీకేజ్, ఎక్కువసార్లు వెళ్లాల్సిరావడం వంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్(UTI) లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు స్కానింగ్ నిర్వహించగా.. బ్లాడర్‌లో గాజుతో కప్పబడిన 8 సెం.మీ వెడల్పయిన రాయి ఉందని, అది గ్లాస్ మాదిరి కనిపిస్తుందని చెప్పారు.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. సదరు మహిళ నాలుగేళ్ల కిందట సెక్సువల్ ప్లెజర్ కోసం డ్రింకింగ్ గ్లాస్‌ను ఉపయోగించినట్లు తమకు చెప్పిందని డాక్టర్లు వెల్లడించారు. అయితే సెక్సువల్ స్టిమ్యులేషన్ కోసం ఉపయోగించిన గ్లాసు యోనికి బదులుగా మూత్రనాళంలోకి వెళ్లినట్లు తెలిపారు. అందుకే ఏడాది నుంచి urgenturia లేదా మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది అన్నారు. ఈ మేరకు డాక్టర్లు నిర్వహించిన మూత్ర పరీక్ష నమూనా లో ఎరుపు, తెలుపు రక్త కణాల ఉనికి కనిపించగా.. UTI కు సంబంధించి ఇది సంక్లిష్ట పరిస్థితి అని పేర్కొన్నారు. మొత్తానికి హబీబ్ బోర్గుయిబా యూనివర్సిటీ హాస్పిటల్‌లోని వైద్యులు సిస్టోలిథోటమీ ఓపెన్ సర్జరీ ద్వారా తొలగించారు.


'ఇంట్రా - వెసికల్ ఫారిన్ బాడీస్' గా పేర్కొనే ఇలాంటి వస్తువులను చాలామంది లైంగిక లేదా శృంగార ఉద్దేశాలతో ప్రైవేట్ పార్ట్స్‌లోకి చొప్పిస్తారు. ఒక్కోసారి సరైన మార్గాన్ని ఎంచుకోక మూత్రాశయంలో ఇరుక్కుపోయి పరిస్థితి జఠిలంగా తయారవుతుంది. ఇలాంటి స్థితిని బయటికి చెప్పుకునేందుకు భయపడి వైద్యులను సంప్రదించరు. పరిస్థితి విషమించినపుడే ఆస్పత్రికి పరిగెడతారు.

Tags:    

Similar News