బిగ్ బ్రేకింగ్: నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత ఆదివారం బోధన్ పట్టణంలో జరిగిన అల్లర్ల విషయంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వాఖ్యలపై కేసు నమోదైంది.

Update: 2022-03-26 14:10 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత ఆదివారం బోధన్ పట్టణంలో జరిగిన అల్లర్ల విషయంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వాఖ్యలపై కేసు నమోదైంది. నిజామాబాద్‌కు చెందిన ప్రతాప్ అనే విద్యార్థి సంఘం నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు సెక్షన్ల కింద నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈనెల 20న బోధన్‌లో రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఆందోళనలు, అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. గతవారం ఎంపీ అర్వింద్ ఒకవర్గంపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంపీపై కేసు నమోదైంది.

బోధన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన టీఆర్ఎస్ నేత

బోధన్‌లో గత ఆదివారం జరిగిన అల్లర్ల కేసులో ఉన్న టీఆర్ఎస్ నేత, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, స్థానిక కౌన్సిలర్ శరత్ రెడ్డి శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. అనంతనం స్టేషన్ బెయిల్ తీసుకున్నట్టు తెలిసింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గత శనివారం రాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటుకు సహకరించి అల్లర్లు, ఆందోళనలకు కారణమయ్యాడని శరత్ రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలు, స్థానికంగా ఉన్న వ్యక్తుల సమాచారం మేరకు ఈ కేసులో 70 మందిని గుర్తించిన పోలీస్‌లు పలువురు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేసిన పోలీసులు అందులో సగానికి పైగా మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News