50 ఏళ్ల క్రితంనాటి బ్రిడ్జ్‌ని కొట్టేసిన దొంగలు..
దిశ, వెబ్‌డెస్క్: కావ్యానికి కాదేది అనర్హం అని ఆనాడు శ్రీశ్రీ అన్నారు. నేటి తరంలో దొచుకోవడానికి కాదేది అనర్హం అని దొంగలు అంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కావ్యానికి కాదేది అనర్హం అని ఆనాడు శ్రీశ్రీ అన్నారు. నేటి తరంలో దొచుకోవడానికి కాదేది అనర్హం అని దొంగలు అంటున్నారు. బిహార్‌లో జరిగిన ఓ ఘటన దీనిని అక్షర సత్యం చేస్తోంది. 50 ఏళ్ల క్రితం కట్టిన ఓ ఐరన్ బ్రిడ్స్‌ను దొంగలు కొట్టేశారు. అవును.. ఇది వినడానికి వింతగానే ఉన్నా.. ఇది నిజం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు ఆ ఇనుప బ్రిడ్జిని 50 ఏళ్ల క్రితం అంటే 1972 సంవత్సరంలో నిర్మించారు. అది 60 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే నీటిపారుదల శాఖ అధికారలమని నమ్మపలికి కొందరు దొంగలు ఆ బ్రిడ్జినే కాజేశారు. బ్రిడ్జిన్ దొంగలించడానికి దుండగులు గ్యాస్ కటర్ ఉపయోగించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద క్రెయిన్‌ల సహాయంతో బ్రిడ్జిన్ పగలకొట్టారు. అయితే ఇదంతా చేయడానికి వారు స్థానికుల సహాయం కూడా తీసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, త్వరలోనే దొంగలను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.