జమ్ములో 34 మంది బయటివారు ఆస్తులు కొన్నారు.. కేంద్రం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు - 34 people from outside bought properties in J&K after Article 370 was scrapped: Govt
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో 34 మంది కశ్మీరేతర వ్యక్తులు ఆస్తులు కొనుగోలు చేసినట్లు కేంద్రం తెలిపింది. లోక్‌సభలో కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం వెల్లడించారు. ఆర్టికల్ 370 ద్వారా ఇది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. దీంతో పాటు బయటి వ్యక్తులకు ఆస్తులు సంపాదించడాన్ని నిషేధించింది.
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆస్తులు కొనే అవకాశాన్ని కల్పించింది. దీంతో 34 మంది కశ్మీరేతర వ్యక్తులు ఆస్తులు కొనుగోలు చేశారు. జమ్మూ, రియాసి, ఉదంపూర్, గందర్బాల్ జిల్లాల్లో కొన్నట్లు తెలిపారు.