ఇకనుండి గ్రేటర్‌లో టెలీ మెడిసిన్​

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలోని కొవిడ్​పేషంట్లతో పాటు, కరోనా లక్షణాలపై భయాందోళనలకు గురయ్యే ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు ఇచ్చేందుకు టెలీ మెడిసిన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ కొవిడ్ సెంటర్​ద్వారా కొవిడ్ పాజిటివ్, లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉచితంగా వైద్య సలహాలను పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో ప్రజలెవరూ ఆందోళన చెందకుండా ఇంటి నుంచి వైద్య సమాచారం కోసం సంప్రదించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొవిడ్​సంబంధిత వైద్య […]

Update: 2021-05-03 12:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలోని కొవిడ్​పేషంట్లతో పాటు, కరోనా లక్షణాలపై భయాందోళనలకు గురయ్యే ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు ఇచ్చేందుకు టెలీ మెడిసిన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ కొవిడ్ సెంటర్​ద్వారా కొవిడ్ పాజిటివ్, లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉచితంగా వైద్య సలహాలను పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో ప్రజలెవరూ ఆందోళన చెందకుండా ఇంటి నుంచి వైద్య సమాచారం కోసం సంప్రదించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొవిడ్​సంబంధిత వైద్య సహాయాన్ని, కొవిడ్ పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు తదితర సలహాలు సూచనలను అందించే సేవలను జీహెచ్ఎంసీ కొవిడ్​కంట్రోల్ రూమ్ నుంచి అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

కొవిడ్​ కంట్రోల్​రూం నెంబర్​ద్వారా సంప్రదించేందుకు 20 మంది డాక్టర్లను ప్రత్యేకంగా నియమించింది. వీరు రెండు షిప్టుల్లో పనిచేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇక నుంచి గ్రేటర్​పరిధిలో కొవిడ్​ సహాయం కోసం 104కు వచ్చే కాల్స్‌ను కూడా జీహెచ్ఎంసీ కంట్రోల్​ రూం నెంబర్ కే ట్రాన్స్​ఫర్​చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యులకు సోమవారం ప్రత్యేకం ఓరియంటేషన్​ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ద్వారా కొవిడ్​సహాయానికి 040 – 21111111 అనే నెంబర్‌లో సంప్రదించాలని వైద్యశాఖ కార్యదర్వి రిజ్వీ సూచించారు. జీహెచ్ఎంసీలో సోమవారం ప్రారంభించిన టెలీ మెడిసిన్స్​ సర్వీస్​ డాక్టర్లతో వైద్యశాఖ ఓఎస్​డీ గంగాధర్, కమిషనర్​లోకేష్​కుమార్​మాట్లాడారు. కొవిడ్ పై వైద్య సలహాలు, సూచనలతో పాటు మెడికల్​ కిట్స్ కోసం ఈ కాల్​ సెంటర్​ పనిచేస్తుంది.

సర్కిల్​ అధికారులకు బాధ్యతల అప్పగింత

హోం ఐసోలేషన్​లో ఉన్న వ్యక్తులకు మెడికల్, కొవిడ్ కిట్స్​ను అందించే బాధ్యతలను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించింది. కొవిడ్ కిట్ల కోసం బల్దియా కంట్రోల్​రూమ్‌కు నగరం పలు చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్​కిట్లను అందించే బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌ లకు అప్పగించారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో కొవిడ్​పేషంట్​ఏరియాను బట్టి సంబంధిత డీసీ, ఏఎంఓహెచ్​లే కిట్స్‌ను అందించనున్నారు. హోం ఐసోలేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం, పేషంట్లకు ఇండ్ల వద్ద ఐసోలేషన్​లో ఉండే సౌకర్యం లేకపోతే సర్కిల్​పరిధిల్లో ఏర్పాటు చేసే కొవిడ్​కేర్​సెంటర్లలో చేర్చి వైద్య సహాయాన్ని అందించనున్నారు.

Tags:    

Similar News