13 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తాం.. షర్మిల
వైఎస్సార్టీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 13 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్టీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 13 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన షర్మిల.. అక్కడి పోడు రైతులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేండ్లలోనే 3.30లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. కానీ గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదేండ్లుగా ఒక్క ఎకరాకు కూడా పోడు పట్టా ఇవ్వలేదని మండిపడ్డారు.
కేసీఆర్ మోసాలపై రాష్ట్ర ప్రజలంతా మేలుకోవాలని కోరారు. వైఎస్సార్టీపీ గిరిజనుల పక్షాన నిలబడిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే గిరిజనలకు ఉచిత విద్య, వైద్యం పాటు ఇండ్లు, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
మహానేత YSR ఐదేండ్లలోనే 3.30లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన KCR తొమ్మిదేండ్లుగా ఒక్క ఎకరాకు కూడా పోడు పట్టా ఇవ్వలేదు.YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తామని YSR బిడ్డ హామీ ఇస్తుంది. pic.twitter.com/W6wxIYMusk
— YS Sharmila (@realyssharmila) April 20, 2023