YSR బిడ్డకు సీఎం కేసీఆర్ భయపడుతుండు: YS షర్మిల ఫైర్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

Update: 2023-03-28 09:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మంగళవారం వైఎస్ షర్మిల చలో ఉస్మానియాకు పిలుపునివ్వగా పోలీసులు ఆమెను ఇంటి వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ బిడ్డకు సీఎం కేసీఅర్ భయపడుతున్నాడని.. అందుకే తనను ఆపుతున్నాడని అన్నారు. దీంతో కేసీఆర్ నియంత అని మరోసారి నిరూపణ అయ్యిందన్నారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాలని అనుకున్నామని.. అక్కడ రోగులకు వైద్యం అందడం లేదు అని అన్నారు.

అక్కడి సమస్యలు ప్రత్యక్షంగా చూడాలని.. ఇందుకు తాను ఒక్కదానినే వస్తానని.. దమ్ముంటే అనుమతి ఇవ్వాలని సవాల్ విసిరారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద టవర్స్ కడతామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. రూ. 200 కోట్లతో కడతామని చెప్పిన హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదని.. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. మొన్న రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని.. ప్రజల పక్షాన నిలబడటం తప్పా..? అని నిలదీశారు. రాష్ట్రంలో సీఎం కేసీఅర్ ఒక డిక్టేటర్‌గా వ్యవహారిస్తున్నాడని మండిపడ్డారు.

Tags:    

Similar News