BJP: తిట్టినంత మాత్రాన పాలన చేసినట్టేనా.. రాణి రుద్రమ సంచలన విమర్శలు

అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్లు కాదని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనపై దృష్టి పెట్టాలని బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ రెడ్డి(BJP spokesperson Rani Rudrama Reddy) అన్నారు.

Update: 2024-11-20 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్లు కాదని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనపై దృష్టి పెట్టాలని బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ రెడ్డి(BJP spokesperson Rani Rudrama Reddy) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office)లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ వరంగల్ సభ(Congress Warangal Meeting)పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ మహిళల పేరుతో పెట్టిన సభ కాదని, మహిళలను వంచించి పెట్టిన సభ అని వ్యాక్యానించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొందని ఆరోపించారు. హోంమంత్రి(Home Minister) లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎలా ఉంటదని, అలాంటి పరిస్థితుల్లో.. మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. సోనియమ్మ, ఇందిరా గాంధీలు మీకు దేవత అయితే.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను కూడా దేవతగా కొలచి.. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.

50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహిళల సంక్షేమం పట్ల సోయి లేకుండా పాలించడం సిగ్గుచేటని, మహిళల గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదని, మహిళల రక్షణపై బాధ్యత లేదని, కాంగ్రెస్ పార్టీకి మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి కొంచమైన జ్ఞానముంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి పనిచేయాలని, బీజేపీ(BJP)ని, ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)ని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పట్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పరిపాలన దక్షత అనిపించుకోదని గుర్తెరగాలని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి.. బీజేపీని విమర్శించడం బంద్ పెట్టి, మందిని తొక్కుడు బంద్ చేసి, మహిళలను ముంచుతూ.. మోసం చేయడం బంద్ చేసి పరిపాలన మీద దృష్టిపెట్టాలని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్(Congress) తీరు మార్చుకోకుంటే.. నిన్న సభకు వచ్చిన లక్షలాది మంది మహిళలే.. రేపు చీపురు పట్టుకుని మీ వెంటపడక తప్పదని రాణి రుద్రమ హెచ్చరించారు.

Tags:    

Similar News