VH: కష్టపడ్డ వారిని రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) కూడా సేవాదల్(Sevadal) నుండి వచ్చిన వ్యక్తేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు(V.Hanumantha Rao) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) కూడా సేవాదల్(Sevadal) నుండి వచ్చిన వ్యక్తేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు(V.Hanumantha Rao) అన్నారు. గాంధీభవన్(Gandhi Bhavan) లో అఖిల భారత కాంగ్రెస్(Indian National Congress) సేవాదళ్(Sevadhal) 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎంపీ వీహెచ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar yadav), మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వీహెచ్ మీట్లాడుతూ.. సేవాదళ్ వేడుకలు జరుపుకోవడం సంతోషం గా ఉందని అన్నారు. అలాగే సేవాదళ్ నుంచి వచ్చిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు ప్రధాన మంత్రి అయ్యాడని, రాజీవ్ గాంధీ కూడా సేవాదళ్ నుంచి వచ్చిన వ్యక్తేనని స్పష్టం చేశారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ ది కీలక పాత్ర అని, సేవాదల్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామా స్థాయిలో కూడా కష్టాలలో ఉన్న వారికి సేవ చేయాలని, కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో అవకాశాలు ఉంటాయని, సీఎం రేవంత్ రెడ్డి కష్ట పడ్డ వారిని గుర్తించి అవకాశాలు కల్పిస్తారని వీహెచ్ వ్యాఖ్యానించారు.