CM Revanth Reddy: కేసీఆర్.. నీ లెక్కలన్నీ బయటకు తీస్తాం: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

‘కేసీఆర్ (KCR) నీ లెక్కలన్నీ బయటకు తీస్తా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-20 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘కేసీఆర్ (KCR) నీ లెక్కలన్నీ బయటకు తీస్తా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడ (Vemulawada) సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) పదేళ్లలో చేయలేని పనులను తాము 10 నెలల్లోనే చేసి చూపించామని అన్నారు. పదేళ్లలో అధికారంలో ఉండి రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ (KCR), రూ.100 కోట్లతో వేములవాడ (Vemulawada) ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదని కామెంట్ చేశారు. ఏలేశ్వరం పోయినా.. శనేశ్వరం వదలలేదన్నట్లుగా బీఆర్ఎస్ (BRS) వాళ్ల పరిస్థితి ఉందని, ఎన్నికల్లో ఓడినా వారి తీరు మాత్రం మారలేదని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) వచ్చిన సీట్లు చూసి వాళ్లకు మెదడు కూడా పోయినట్టుందని అన్నారు. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. తమను పది నెలల్లో మనల్ని దిగి పొమ్మంటున్నారని ఫైర్ అయ్యారు. మీ నొప్పికి మా కార్యకర్తలకు మందు ఎక్కడ పెట్టాలో తెలుసని సెటైర్లు వేశారు.

ఆనాడు అన్నదాతలు వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌ (KCR)ది అని అన్నారు. నేడు ఆ రైతులే ఒక్క చుక్క కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు లేకుండా 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ (KCR) ప్రాజెక్టుల కోసం 1.23 లక్షల కోట్లు ఖర్చు చేశారని.. ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ (Ranga Nayak Sagar) కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌రావు (Harish Rao) ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. త్వరలోనే మామ, అల్లుడి లెక్కలు తీస్తామని అన్నారు. కొండపోచమ్మ సాగర్ (Konda Pochamma Sagar) కట్టింది కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లేందుకేనని అన్నారు. ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు నారాయణపేట్-కొడంగల్ (Narayanpet - Kodangal) ఎత్తిపోతల పూర్తి చేద్దామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నరని కామెంట్ చేశారు. పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. తెలంగాణ (Telangana)లో పరిశ్రమలు పెట్టోద్దా.. యువతకు ఉద్యోగాలు రాకూడదా అని సీఎం రేవంత్ అన్నారు.

Tags:    

Similar News