‘ఇక్కడ అంతా బాగుంటే.. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడు’
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఆరోగ్య తెలంగాణ చేశానని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి కంటి, పంటి నొప్పికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అని ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఆరోగ్య తెలంగాణ చేశానని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి కంటి, పంటి నొప్పికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అని ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో స్పందించిన షర్మిల బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగం అటకెక్కిందని ధ్వజమెత్తారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కొ బెడ్ మీద ఇద్దరు ముగ్గురు రోగులను పడేయడామా? లక్ష మందికి ఒక డాక్టర్, పది వేల మందికి ఒక నర్సు ఉండటమా అని నిలదీశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమే ఆరోగ్య తెలంగాణా అని ప్రశ్నించారు. పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొడుతున్నారని జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రాజధాని నలుదిక్కులా హెల్త్ హబ్‌లు, ఉస్మానియా హెల్త్ టవర్ ఏమైందని ప్రశ్నించారు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడని ఆరోపించారు. మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవని దవాఖానాల్లో సిబ్బంది లేరని మండిపడ్డారు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని ఆరోపించారు..
ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు? ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా? లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా? కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? JHS, EHS స్కీములను పాతరేయడమా?
— YS Sharmila (@realyssharmila) April 7, 2023
1/3