Sama Rammohan Reddy : తెలంగాణ ద్రోహులైన మిమ్మల్ని వదలం : సామ

బీఆర్ఎస్ నేతల(Brs Leaders) అరెస్టు(Aresst)లపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎక్స్ వేదికగానే ఘాటు కౌంటర్ (Counter)వేశారు.

Update: 2024-12-26 07:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నేతల(Brs Leaders) అరెస్టు(Aresst)లపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎక్స్ వేదికగానే ఘాటు కౌంటర్ (Counter)వేశారు. మాది ఇందిరమ్మ కలలు గన్న ప్రజల రాజ్యమని, పిట్ట బెదిరింపులకు భయపడమంటూనే కాళ్లు కాలిన కోతుల్లా ఎగురుతున్నారేందుకని హరీష్ రావుకు సామ చురకలేశారు. అవును మాది మంచి వాళ్లకు ప్రజా పాలనగా..పది సంవత్సరాలు ప్రజల రక్త మాంసాలు తిన్న మీ లాంటి రాక్షసులకు రాక్షస పాలనగానే కనిపిస్తుందని స్పష్టం చేశారు.

అవును..అక్రమార్కుల అరెస్టులు.. అవినీతిపరులపై కేసులు..బెదిరింపులకు లొంగని పాలనే...మా విధానమని సామ పేర్కొన్నారు. ప్రజలను బలిపశువులు చేసే మీ కుటుంబ రాజకీయ కుట్రలను సాగనివ్వబోమని, తెలంగాణ ద్రోహులైన మిమ్మల్ని వదలబోమని సామ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News