Yadagirigutta : యాదగిరిగుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ..లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)..ప్రత్యేక అభిషేక పూజలు, ఏకాదశి లక్ష పుష్పార్చన(One lakh flowers Archana) ఘనంగా నిర్వహించారు.

Update: 2024-12-26 06:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)..ప్రత్యేక అభిషేక పూజలు, ఏకాదశి లక్ష పుష్పార్చన(One lakh flowers Archana) ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల నమో నారసింహ, గోవింద నామస్మరణలతో యాదగిరిలు మారుమ్రోగాయి.

అటు గర్భాలయంలో స్వాతి నక్షత్రం పురస్కరించుకుని కలశ పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఈ రోజు ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు.

Tags:    

Similar News