ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో, హితైషి ఫౌండేషన్ ఫర్ థియేటర్ ఆర్ట్స్ వారి వార్షికోత్సవం, ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుక సోమవారం కూకట్‌పల్లిలోని భారత్ వికాస్ పరిషత్‌లో నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో, హితైషి ఫౌండేషన్ ఫర్ థియేటర్ ఆర్ట్స్ వారి వార్షికోత్సవం, ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుక సోమవారం కూకట్‌పల్లిలోని భారత్ వికాస్ పరిషత్‌లో నిర్వహించారు. కాళ్ళకూరి నారాయణ రావు రచించిన ‘భక్త చింతామణి’ సాంఘిక పద్యనాటకాన్ని సంస్థ కళాకారులు ప్రదర్శించారు. చింతామణిగా నంది, బళ్లారి రాఘవ అవార్డుల గ్రహీత సాయి లక్ష్మి చాగంటి అద్భుతంగా నటించారు. సీనియర్ కళాకారులు ఇందుకూరి మనోహర్రాజు బిళ్వమంగళునిగా, యువ నటులు పీ.సాయి వెంకట్, చిత్రగా మను ప్రియ, రాధగా జ్యోతి, సుబ్బిశెట్టిగా రాము... ప్రధాన పత్రాలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ నామా చంద్రబాబు నాయుడు సమాకూర్చిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరబ్రహ్మం సహకారం అందించారు. నాటకానంతరం కళాకారులకు సన్మానాలు చేశామని సంస్థ నిర్వాహకురాలు గాయత్రీ చాగంటి చెప్పారు.