దిశ కార్యాలయంలో మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్

దిశ, తెలంగాణ బ్యూరో : 'దిశ' ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా

Update: 2022-03-08 12:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : 'దిశ' ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యాలయాల్లో కొలీగ్స్ గా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పురుషులు.. ఇంట్లో ఉండే స్త్రీలను ఎందుకు చిన్నచూపు చూస్తారని ఫీచర్స్ డెస్క్ ఇన్‌చార్జి సుజిత ప్రశ్నించారు. ఆఫీసుల్లో కలిసి పనిచేసే మహిళలను ఎలా గౌరవిస్తారో అలాగే తమ ఇంట్లోని మహిళలను డెమోక్రటిక్ గా చూడాలని కోరారు. ప్రతి పురుషుడు తమ కుటుంబంలోని ఆడవాళ్లకు ప్రాముఖ్యత, వారి మాటకు విలువ ఇచ్చినప్పుడే సమాజంలో వారికి దక్కాల్సిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పురుషులే కాదు మహిళలు కూడా స్వశక్తితో ఎదుగుతున్నారని దిశ వెబ్‌సైట్ ఇన్‌చార్జి వనజ పేర్కొన్నారు. ఒక మహిళ విజయం సాధించిందంటే దాని కోసం ఆమె చేసిన కృషిని, ట్యాలెంట్ ను గుర్తించాలన్నారు. అంతేకానీ వారి ఎదుగుదలను ఓర్వలేక వ్యక్తిగతమైన దుష్ప్రచారాలు చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. ఇలాంటి రూమర్స్ ను తిప్పికొడుతూ, అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు స్వతంత్రంగా నిలబడాలని సూచించారు. మహిళలకు సపోర్టుగా నిలుస్తున్న పురుషులకు ఆమె ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు.

ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ సమాజంలో పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నా వారిపై ఇంకా కొంత వివక్ష కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఇలాంటి వివక్షను స్త్రీలే బ్రేక్ చేయాలని, తమకు కావాల్సిన స్వేచ్ఛను తామే కల్పించుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రుల ఓవర్ ప్రొటెక్షన్ వారి ఎదుగుదలకు అడ్డుకాకూడదని అభిప్రాయపడ్డారు. అర్ధరాత్రి అమ్మాయిలు సేఫ్ గా తిరిగే స్పేస్ ను వారే క్రియేట్ చేసుకోవాలని, తమకు కావాల్సిన ఇండిపెండెన్స్ ను సొంతం చేసుకోవాలని కోరారు.

Tags:    

Similar News