CMR College Incident : సీఎంఆర్ కాలేజీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

సీఎంఆర్ కాలేజీ(CMR College)లో బాలికల అశ్లీల వీడియోల(Controversy Videos of Girls) వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్(Women's Commission) సుమోటో(Sumoto)గా స్పందించింది.

Update: 2025-01-02 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎంఆర్ కాలేజీ(CMR కాలేజీ)లో బాలికల అశ్లీల వీడియోల(Controversy Videos of Girls) వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్(Women's Commission) సుమోటో(Sumoto)గా స్పందించింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్‌(Cyberabad Commissioner)కు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిల బాత్ రూమ్ లలో కెమెరాలు పెట్టి 300కు పైగా అశ్లీల వీడియోలు తీసినట్లుగా వచ్చిన మీడియా కథనాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మరోవైపు ఈ ఘటనపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కళాశాలల చైర్మన్ గోపాల్ రెడ్డి విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కాగా సీఎంఆర్ కాలేజీ ఘటనపై యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు స్నానం చేస్తున్నప్పుడు బాత్ రూమ్ ల వెనుక భాగంలో వ్యక్తులు తచ్చాడుతున్నట్టు గమనించామని విద్యార్థులు మాకు చెప్పారని, మహిళా పోలీసులతో బాత్ రూమ్ ల వద్ద తనిఖీలు చేయించామని, ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయన్నారు.

మెస్‌లో పని చేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందన్న కోణంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి 12 సెల్ ఫోన్లను సీజ్ చేశామని తెలిపారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదన్నారు. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. విద్యార్థుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News