మరమ్మత్తులు చేయకుండా.. చెరువు కట్టలపై దశాబ్ది ఉత్సవాలా ?

చెరువు కట్టలపై పరిశుభ్రమైన వాతావరణం లేకుండా పండుగలెలా చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Update: 2023-06-08 04:35 GMT

దిశ మక్తల్: చెరువు కట్టలపై పరిశుభ్రమైన వాతావరణం లేకుండా పండుగలెలా చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కట్టపై ముళ్లకంచెలు, పాడైన తూములు, వ్యర్థ పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ఇలా వ్యర్త పదార్థాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే దశాబ్ది ఉత్సవాల పండుగలు, సహపంక్తి భోజనాలు ఎలా నిర్వహిస్తారని.. చెరువు దిగువన ఉన్న ఆయకట్టు దారులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించినా.. చెరువ గట్లపై ముళ్ళకంచెలు. వ్యర్తపదార్థాలు మరమ్మత్తులకు నోచుకోని తూములు ఉన్నాయి, ఉత్సవాల్లో ఏడవ రోజు గురువారం పండుగ వాతావరణం. సహపంక్తి భోజనాలు. ఉంచాలని ప్రభుత్వ ప్రణాళికలో ఉన్నాయి.

మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంకై తెరాస ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తుది మెరుగుల పనులను మక్తల్ మున్సిపాలిటీకి అప్పగించిననాటి నుండి చెరువు నిర్లక్ష్యానికి గురైందని ఆయకట్టు దారులు ఆరోపిస్తు న్నారు. చెరువు దిగువ సాగు భూములకు నీరు వదలాలన్నా పాడైన తూములు బాగు చేయాలి. తూములకున్న ఇనుప షట్టర్లు పాడైన విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ..నేటికీ మరమ్మత్తులకు నోచుకోలేదు.

మిషన్ భగీరథ కింద మక్తల్ చెరువు రెండు పంటలకు నీరు అందుతుంది. కాని మిషన్ కాకతీయ కింద చెరువులను చెరువు కట్టలను విస్తరించినప్పుడు టెక్నికల్ పరంగా తూముల ను ఏర్పాటు చేయకపోవడంతో చెరువు నీరు దిగువ ఆయకట్టు రైతులకు అందటంలేదు. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మరమ్మత్తులకు సంబంధిత అధికారులను ఆదేశించారు. కాని అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికి స్పందించలేదు, ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకుని.. చెరువు మరమత్తు పనులు చేపట్టాలని ఆయకట్ట రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News