తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ పార్టీని మళ్ళీ నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా నాలుగో సారి ఎన్నికయ్యారు.

Update: 2024-07-07 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా నాలుగో సారి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంతో విభజన సమయంలో మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నారు. అనంతరం హైదరాబాద్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలంగాణ టీడీపీ భవన్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు సీఎం చంద్ర బాబు కు సన్మానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేటికి బలంగా ఉందని.. కీలక నేతలు పార్టీ మారినప్పటికి కార్యకర్తలు మాత్రం పార్టీ మారలేదని.. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని.. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ పార్టీనీ మళ్లీ నిర్మిస్తామని.. టీ టీడీపీ పార్టీనీ యువ రక్తంతో నింపుతానని సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలకు హామీ ఇచ్చారు. అలాగే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. 2047 సంవత్సరం వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.


Similar News