క్రమశిక్షణకు మారుపేరు ‘అలెన్’: కోచ్ గోపీచంద్‌

అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ క్రమశిక్షణకు మారుపేరని జాతీయ బ్యాడ్మింట‌న్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. న‌గ‌రంలోని ఒక హోట‌ల్‌లో శనివారం జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మ‌ట్లాడారు.

Update: 2024-10-05 17:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ క్రమశిక్షణకు మారుపేరని జాతీయ బ్యాడ్మింట‌న్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. న‌గ‌రంలోని ఒక హోట‌ల్‌లో శనివారం జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మ‌ట్లాడారు. అలెన్ వంటి ప్రతిష్టాత్మక విద్యా శిక్షణ సంస్థలు హైద‌రాబాద్‌లో త‌మ కార్యకలాపాలను ప్రారంభించ‌డం శుభ‌ప‌రిణామ‌న్నారు. ప్రతిభావంతులైన విద్యార్థుల‌కు త‌మ నైపుణ్యాల‌ను మ‌రింత సాన పెట్టుకునేందుకు అలెన్ ఒక మంచి వేదిక‌ అన్నారు. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ.. బ్యాడ్మింట‌న్‌కు కేరాఫ్ గోపీచంద్ అకాడ‌మీ ఎలానో పోటీ ప‌రీక్షల శిక్షణకు అలెన్ కూడా అంతే విశిష్టమైన సంస్థ అని చెప్పారు. హైద‌రాబాద్‌లో అలెన్‌-అక్షర విద్యాసంస్థలు క‌లిసి ప‌నిచేయ‌నున్నాయ‌ని అన్నారు. విద్యార్థుల‌కు మేలు చేకూర్చడ‌మే త‌మ ల‌క్ష్యమ‌న్నారు. అలెన్ సంస్థల సీఈవో నితిన్ కుక్రేజా మాట్లాడుతూ తొలిద‌శ‌లో భాగంగా ఐదు క్యాంప‌స్‌ల‌ను అలెన్ ప్రారంభించ‌నుంద‌ని, వ‌చ్చే మూడేళ్లలో 20 వేల మంది విద్యార్థుల‌కు నాణ్యమైన శిక్షణ ఇవ్వడ‌మే త‌మ ల‌క్ష్యమ‌న్నారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డీ అనుప్ య‌మ‌, సౌత్ ఇండియా హెడ్ మ‌హేశ్ యాదవ్, అలెన్‌, అక్షర సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.


Similar News