తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. స్పెషల్ గెస్ట్ గా ప్రియాంక గాంధీ?
సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్న తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ వేడుకను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. స్టాచ్యూను సోనియాగాంధీ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత సెక్రటేరియట్ ఎదుట పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 9న జరిగే ముగింపు వేడుకలకు ఏఐసీసీ అధినేతలు సోనియా, రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీనీ ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే రోజు సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణతల్లి విగ్రహావిష్కరణకు ఆమె స్పెషల్ గెస్ట్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ లీడర్లలోనూ వ్యక్తమవుతున్నది. గతేడాది డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆ ముగ్గురు లీడర్లు హాజరయ్యారు. ప్రస్తుత వేడుకలకు సైతం వారిని స్టేట్‌కు ఆహ్వానించాలనే ప్రయత్నంలో సీఎం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్న తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ వేడుకను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. స్టాచ్యూను సోనియాగాంధీ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత సెక్రటేరియట్ ఎదుట పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు కావాల్సిన స్థలం లేకపోవడంతో ట్యాంక్ బండ్ చుట్టూ ప్రత్యేకంగా స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆ వేదిక నుంచి సోనియా, రాహుల్, ప్రియాంకలతో మాట్లాడించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు సమాచారం. అయితే సోనియాగాంధీ అరోగ్య సమస్యల వల్ల రాష్ట్రానికి వస్తారో.. లేదోననే డిస్కషన్ సైతం పార్టీలో నడుస్తున్నది. విజయోత్సవాలకు రావాలని సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించేందుకు రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.