తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేస్తాం : సింకారు శివాజీ

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల సందర్బంగా శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్పందించారు.

Update: 2023-10-09 12:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల సందర్బంగా శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే శివసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శివసేన పార్టీ అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. చాల మంది టచ్‌లో ఉన్నట్టు.. ఏక్‌నాథ్‌ షిండే సమక్షంలో వివిద పార్టీల కీలకమైన నాయకులు, మాజీ ఎమ్ఎల్ఎ లు ఎమ్ఎల్సీ లు మున్సిపల్ చైర్మెన్ లు వివిద పార్టీల నేతలు చేరుతారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికలలో ఈ సారి శివసేన పార్టీ సత్తా చాటుతుందని తెలిపారు. ఎమ్ఐఎమ్ పార్టీకి శివసేన పార్టీ బలమైన పోటి ఇస్తుందని.. ఈ సారి ఓవైసి బ్రదర్స్‌ని ఒడించేందుకు బలమైన కార్యచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం కేసీఆర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిన కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పే రోజు వచ్చిందని ప్రజలు ఈ అవకాశం ఉపయొగించుకోవాలని పిలుపునిచ్చారు.

శివసేన మూల సిద్దాంతం గర్వంగా చెప్పు నేను హిందువు అని..

(Garv Se Kaho Hum Hindu Hai) అనే సిద్దాంతంతో ప్రజలలోకి వెళ్తామని అన్నారు. మహారాష్ట్ర నుంచి శివసేన పార్టీ అగ్రనాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, MLA, MLC ఇతర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేని కలిసి ఎన్నికల గురించి చర్చిస్తానని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌ పార్లమెంట్ కన్వినర్ సూర్యవంశీ రమేష్, బాలపూర్ అహ్మద్, రాహుల్, గోపాల్ రాజ్, సతీష్, అఖిల్‌ తదితరులు ఉన్నారు.


Similar News