100 సీట్లు సాధించి తీరుతాం.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు తమ పని అయిపోయిందని అనుకుంటున్నాయని మంత్రి హరీష్ రావు ఎద్దేవా
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు తమ పని అయిపోయిందని అనుకుంటున్నాయని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన తొలి ప్రచార సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హుస్నాబాద్ అంటే సీఎం కేసీఆర్‌కు నమ్మకం, గురి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని.. 100 సీట్లు సాధించి తీరుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను అమలు చేస్తారని కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. హుస్నాబాద్ నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖరావాన్ని పూరించారు.