Minister komatireddy Venkat Reddy: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారి గుండెల్లో నిలిచిపోయాం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీసుకున్న పంట రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం సాయంత్రం రూ. లక్ష వరకు మాఫీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీసుకున్న పంట రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం సాయంత్రం రూ. లక్ష వరకు మాఫీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలో ర్యాలీగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో ఈ రోజు నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొందని.. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.
నల్గొండ నియోజకవర్గంలో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ కోసం ప్రభుత్వం 46.16 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలు రుణమాఫీ పొందారు. ఇందుకోసం రూ. 481.63 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దీంతో పాటుగా జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారి సహకారంతో నల్లగొండ జిల్లాకు రూ.481.63 కేటాయించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.