నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, నాలాల అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు.

Update: 2024-09-28 07:45 GMT

దిశ, శేరిలింగంపల్లి: నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, నాలాల అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. శనివారం శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నాలా పనులను, అలాగే పలుచోట్ల రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి పరిశీలించిన ఎమ్యెల్యే.. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. వర్షాల నేపథ్యంలో రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నామని, నాలా పనులు చేపట్టడం వల్ల ఈసారి పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదని, త్వరలోనే పనులు పూర్తి అవుతే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. పనులను వేగంగా పూర్తి చేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. నాలాలు, రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న గాంధీ.. వర్షాల వల్ల పాడైన రోడ్లను త్వరలోనే బాగు చేస్తామని తెలిపారు. కాగా ఈ పర్యటనలో ఇంజనీరింగ్, జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News