యాదాద్రి దేవస్థానంలో త్వరలో డిజిటల్ పేమెంట్లతో లడ్డూ..ప్రసాదాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో నాణ్యమైన ప్రసాదాల తయారీతో పాటు, విక్రయాలలో త్వరలో సరికొత్త మార్పులు తేనున్నట్లుగా ఈవో భాస్కర్ రావు తెలిపారు.

Update: 2024-09-28 10:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో నాణ్యమైన ప్రసాదాల తయారీతో పాటు, విక్రయాలలో త్వరలో సరికొత్త మార్పులు తేనున్నట్లుగా ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆలయ పరిసరాలలో ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులకు కావాల్సిన ప్రసాదాల టికెట్లను డిజిటల్ పేమెంట్ చేసి పొందే అవకాశం త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఈవో వివరించారు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు సులభతరంగా ప్రసాదాలు అందించేందుకు అధునాతన వసతులను కల్పించనున్నట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. డిజిటల్ పేమెంట్​ చేసి టికెట్ కూపన్లతో ప్రసాదాలను కౌంటర్లలో పొందవచ్చన్నారు. ప్రస్తుతం లడ్డూ టికెట్ల కౌంటర్, ప్రసాదాలు అందజేసే కౌంటర్లు కొత్తగా వేర్వేరుగా ఏర్పాటయ్యాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం రోజు ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామి వారి ఆలయ ముఖ మండపం నందు వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు.


Similar News