వచ్చే నెల 3వరకు జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

తన జూనియర్ మహిళా కొరియర్ గ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ ను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించింది.

Update: 2024-09-28 09:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : తన జూనియర్ మహిళా కొరియర్ గ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ ను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. నాలుగు రోజుల కస్టడీ ముగియ్యడంతో పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి జుడిషియల్ రిమాండ్ ను వచ్చే నెల 3వరకు పొడిగించారు. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అంతకుముందు జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తాజాగా మరోసారి రిమాండ్ పొడిగించింది.

జానీ మాస్టర్‌ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. మొదటిసారి లైంగికదాడి జరిగినప్పుడు తాను మైనర్‌ను అని చెప్పడంతో పోలీసులు పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్‌ ఇబ్బందులకు గురిచేయడం, ఈ విషయం బయట చెబితే సినీ అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


Similar News