అవన్నీ కూల్చేయాల్సిందే.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలోని మూసీ నది(Musi river)పై నిర్మించిన కట్టడాలన్నీ అక్రమ నిర్మాణాలే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు.

Update: 2024-09-28 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని మూసీ నది(Musi river)పై నిర్మించిన కట్టడాలన్నీ అక్రమ నిర్మాణాలే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళన జరిగి తీరాల్సిందే అని అభిప్రాయపడ్డారు. దీంతో దిగువన రెండు జిల్లాలకు సాగునీరు పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

మూసీ అంశంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దంటూ హితవు పలికారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్‌ రూపురేఖలే మారతాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై తాజాగా అధికారులు ‘RB-X’ అనే గుర్తు వేస్తున్నారు. సర్వే పేరుతో అనేక ఇళ్లపై ఈ గుర్తు వేశారు. ముందుగా సర్వే చేపట్టి.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో వచ్చే ఇళ్లను కూల్చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.


Similar News