హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు: రంగనాథ్

రెండు నెలలుగా రాష్ట్రంలో అక్రమ కట్టడాలను హైడ్రా(HYDRA) కూల్చి వేస్తూ.. హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Update: 2024-09-28 13:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు నెలలుగా రాష్ట్రంలో అక్రమ కట్టడాలను హైడ్రా(HYDRA) కూల్చి వేస్తూ.. హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాగా ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే సోషల్‌ మీడియా(Social media)లో హైడ్రాపై తప్పుడుప్రచారం జరుగుతోందని.. ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్(Disaster Management) మా బాధ్యత అని అన్నారు. హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందని.. హైడ్రా కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవని రంగనాథ్(Ranganath) క్లారిటీ ఇచ్చారు. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా హైడ్రాను కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని.. హైడ్రా కారణంగా నగరంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని ఈ సందర్భంగా ఏవి రంగనాథ్ చెప్పుకొచ్చారు.


Similar News