ఆ సమయంలో ఎవరేం చేయలేరు.. హైడ్రా అధికారి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌(Hyderabad)ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నట్లు హైడ్రా(HYDRA) అధికారి దాన కిషోర్(Dana Kishore) తెలిపారు.

Update: 2024-09-28 11:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నట్లు హైడ్రా(HYDRA) అధికారి దాన కిషోర్(Dana Kishore) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వరదలతో భారీ ప్రాణనష్టం సంభవించిందని గుర్తుచేశారు. చిన్న వర్షానికే సచివాలయం ముందు అంత వరద ఎన్నడూ చూడలేదు. భారీ వర్షపాతం నమోదు అయితే అధికారులు కూడా ఏం చేయలేరు అని దాన కిషోర్ అన్నారు. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి అని వెల్లడించారు. కేవలం మూసీని బ్యూటిఫికేషన్ చేయడం కోసమే ఈ చర్యలు తీసుకోవడం లేదు. గతంలోనూ నిర్వాసితులను తరలించారు. గత వరదలతో భారీ ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.

గతంలో మూసీ సుందరానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు చేశారని తెలిపారు. మూసీ వరదల వల్ల బాధపడేది ప్రజలే. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి అని దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువుల కాపాడడం కోసం హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైడ్రా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్​జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్​జోన్లలోకి వచ్చిన కట్టడాలకు సర్వే చేసి, ఆక్రమణలపై రెడ్ మార్క్ వేసి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు నిర్వాసితులకు అన్నిరకాల తోడ్పాటును అందించిన తర్వాతే కూల్చివేతలను ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నారు.


Similar News