పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం చేసిన జడ్పీ చైర్మన్

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కార్మికులను ఆదివారం శాలువాలతో సన్మానించి ప్రజల సమక్షంలో శిరస్సు

Update: 2022-03-07 05:20 GMT

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కార్మికులను ఆదివారం శాలువాలతో సన్మానించి ప్రజల సమక్షంలో శిరస్సు వంచి నమస్కరించి వారి పాదాలకు సాష్టాంగ పాదాభివందనం చేశారు. ఆదివారం కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కలిసేందుకు వచ్చి ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సాష్టాంగనమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కార్మికుల సేవలు మరువలేనివని కరోనాతో ప్రపంచానికి మీ అవసరం ఎంతో అనేది ప్రజలకు తెలిసిందిఅన్నారు.కరోనా సమయంలో మీ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని మీ సేవలు మరువలేనివని జగదీశ్ కొనియాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షపాతి మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులు సన్మానించడం తనకు దొరికిన గొప్ప భాగ్యం అని సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం పారిశుద్ధ కార్మికులు టిఆర్ఎస్ నాయకులు సంయుక్తంగా చైర్మన్ కు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గదా సునీల్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్ కోనూరు అశోక్ గౌడ్ ,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు ,జెడ్పి జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు వలీయబి సలీం మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాష ,గ్రామ అధ్యక్షుడు ఎండి ఖాజా పాషా జిల్లా నాయకులు పోరిక గోవింద నాయక్ తుమ్మ మల్లారెడ్డి ఎం పీ టీ సీ కుమ్మరి స్వప్న చంద్రబాబు ఉ జాడి భోజ రావు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News