విద్యుదాఘాతంతో యువకుడి మృతి..
ఓ ఇంట్లో సీలింగ్ పని చేయడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో జరిగింది.
దిశ, ఏటూరునాగారం: ఓ ఇంట్లో సీలింగ్ పని చేయడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బలరాంపూర్ గ్రామానికి చెందిన సీరిసీవ రమేష్ (21), కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం గ్రామానికి చెందిన కరన్ సెట్ అనే వ్యక్తి వద్ద సీలింగ్ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు.
కాగా ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రాంమూర్తి ఇంట్లో సీలింగ్ పని ఉందని వచ్చిన రమేష్ ఇనుప కుర్చీపై నిలబడి మిషన్ తో సీలింగ్ కు సంబంధించిన పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ వైర్ తెగి ఇనుప కుర్చిపై పడి విద్యుదాఘాతాకానికి గురయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న తన మిత్రుడు వైర్‌ను తీసి వేయగా రమేష్ అపాస్మారక స్థితిలో నేల మీద పడిపోయాడు. విద్యుదాఘాతాకానికి గురైన రమేష్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రమేష్ మృతి చెందినట్లు డాక్టర్ దృవీకరించారు.