పనులు ఆలస్యంగా ఎందుకు జరుగుతన్నాయ్: జాయింట్ కలెక్టర్ కూరకుల్ల స్వర్ణలత
తాడిచెర్ల ఓసీపీ కోల్ మైనింగ్ ప్రాజెక్టులో ముంపునకు గురైన ఇండ్ల నిర్వాసితులకు నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ సైట్ కాలనీ పనులు ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి అంటూ గుత్తేదారులపై జిల్లా జాయింట్ కలెక్టర్ కూరకుల స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, మల్హర్: తాడిచెర్ల ఓసీపీ కోల్ మైనింగ్ ప్రాజెక్టులో ముంపునకు గురైన ఇండ్ల నిర్వాసితులకు నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ సైట్ కాలనీ పనులు ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి అంటూ గుత్తేదారులపై జిల్లా జాయింట్ కలెక్టర్ కూరకుల స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిచెర్లలో నిర్వాసితులకు నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ సైడ్ కాలనీ మంగళవారం ఆమె సందర్శించి కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై మండిపడుతూ పనులను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. కాలనీ నిర్మాణం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ, జెన్ కో, ట్రాన్స్ కో తదితర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.