రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..: పరకాల ఎమ్మెల్యే
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు
దిశ, హనుమకొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పిఏసియాస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి అధ్యక్షతన నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తమ అనుచరులకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవ్వడం వల్ల రైతులకు వరి ధాన్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. రైతుకు చిల్లిగవ్వ నష్టం జరగకుండా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సొసైటీల ద్వారానే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగానికి లాభం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
రైతుల కోరిక మేరకు పెద్దాపురం లోనే నూతన సొసైటీ భవనం ఏర్పాటు చేసి రైతులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైతాంగం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. దళారులను నమ్మి వారికి వరి ధాన్యం అమ్ముతే తూకంలో మోసం చేసి అక్రమంగా దోచుకుంటారని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. సొసైటీ కేంద్రాలలో పారదర్శకంగా కొనుగోలు చేస్తారని సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ మాజీ ఎంపీటీసీ కమలాపురం రమేష్,మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, మాజీ ఎంపీపీ గుణికంటి కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ ముద్ధం సాంబయ్య, మాజీ సర్పంచులు పర్వతగిరి రాజు, కంచె రవికుమార్, పరకాల యూత్ అసెంబ్లీ కన్వీనర్ మదాసి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.