Mahabubabad: బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకుంటామని కాంగ్రెస్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు మహబూబాబాద్(Mahabubabad)లో భారీ ధర్నాకు బీఆర్ఎస్(BRS) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు మహబూబాబాద్(Mahabubabad)లో భారీ ధర్నాకు బీఆర్ఎస్(BRS) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నాకు ముందుగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తోంది. మరోవైపు ఈ ధర్నాను అడ్డుకుని తీరుతామని స్థానిక కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో విస్తృతంగా ‘కేటీఆర్ గో బ్యాక్’ అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ధర్నా నేపథ్యంలో మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని దుండగులు చించివేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు.