TG: శుభకార్యాలకు వెళితే ఆ గిఫ్టులు ఇవ్వండి.. తెలంగాణ ప్రజలకు గవర్నర్ కీలక పిలుపు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానం(NTR Ground)లో ఏర్పాటు చేసిన బుక్‌ఫెయిర్(Hyderabad Book Fair)ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) శనివారం సందర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానం(NTR Ground)లో ఏర్పాటు చేసిన బుక్‌ఫెయిర్(Hyderabad Book Fair)ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. పుస్తకాల్లో అనంతమైన జ్జానం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఆడియో పుస్తకాలు(Audio Books) కూడా వచ్చాయని తెలిపారు. మానవ నాగరికత ఉన్నంతకాలం పుస్తకాలు ఉంటాయని చెప్పారు. ఈ-బుక్స్(E-Books) కంటే పుస్తకాలు చదివితేనే ఎక్కువ మజా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తకం చదువుతుంటే నేరుగా ఆ రచయితతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. నేటి యువత పుస్తకాల వైపు మళ్లేలా పెద్దలు ప్రొత్సహించాలని కోరారు.
ఏదైనా శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు బహుమతులు కాకుండా.. పుస్తకాలనే బహుమతులుగా ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఆదివారంతో బుక్ ఫెయిర్ ముగియనుంది. ఎన్‌టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19న ప్రారంభమైన ఈ బుక్‌ఫెయిర్ 29వ తేదీతో ముగుస్తుంది. గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సహా అనేకమంది ప్రముఖులు ఈ బుక్‌ఫెయిర్‌ను సందర్శించారు.