TTD నిర్ణయంపై తెలంగాణ మాజీ మంత్రి హర్షం
తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కానీ వారానికి రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పిస్తామని అనడం సరికాదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను టీటీడీ సమానంగా చూడాలని కోరారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను కూడా వారం రోజుల పాటు అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని అధికార కాంగ్రెస్‌తో విపక్ష నేతలు కూడా ఖండించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని టీటీడీ పునఃపరిశీలించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా కోరారు. దీంతో వారానికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.